PSPK 26 First Look: పవర్‌స్టార్‌ ఫస్ట్‌లుక్‌‌ అదిరిపోయింది

PSPK 26 First Look: పవర్‌స్టార్‌ ఫస్ట్‌లుక్‌‌ అదిరిపోయింది
x
Pawan kalyan New movie
Highlights

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఆశగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చింది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఆశగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చింది. తమ అభిమాన హీరో వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆశపడిన వాళ్లకు పవన్ కళ్యాణ్ నుంచి ఫస్ట్‌గిఫ్ట్‌ అందింది. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీ అయ్యారు. రెండేళ్ల వరకు ఆయన సినిమాలు చేయలేదు. దీంతో పవన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ నటించేందుకు సిద్దమైయ్యారు.

పవన్‌కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి పవన్‌ ఫస్ట్‌లుక్‌ సోమవారం విడుదల చేశారు. అంతేకాకుండా టైటిల్‌ను కూడా ప్రకటించారు. మొదటి నుంచి అందరు అనుకున్నట్లుగానే 'వకీల్‌సాబ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

వకీల్‌సాబ్' ఫస్ట్‌లుక్‌‌లో పవన్ చేతిలో ఓ బుక్, కళ్లజోడు పెట్టుకుని పడుకొని ఉన్న పవన్‌ కళ్యాణ్ లుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన అమితాబ్ 'పింక్‌' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

పవన్‌ చివరిగా 2018లో 'అజ్ఞాతవాసి'లో నటించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రాజకీయాల్లో తీరికలేకుండా గడిపారు. పవన్‌కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుతూ వస్తున్నారు. దీంతో మళ్లి సినిమాల్లో నటించేందుకు పవన్ సిద్దమైయ్యారు. దీంతో సందేశాత్మక చిత్రం పింక్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ లుక్ కోసం సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వేసవిలో ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories