
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మరోసారి అభిమానులకు శుభవార్త అందించారు. ఇటీవలే వకీల్‌సాబ్ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ సారి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేసింది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మరోసారి అభిమానులకు శుభవార్త అందించారు. ఇటీవలే వకీల్‌సాబ్ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ సారి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ చివరిగా 2018లో అంటే రెండేళ్లు క్రితం 'అజ్ఞాతవాసి'లో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత రాజకీయాల్లో బీజీ కావడంతో ఆయన మరో సినిమా చేయలేదు. తాజాగా వస్తున్న వకీల్‌సాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్‌గా 'వకీల్‌సాబ్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
కాగా.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వకీల్‌సాబ్' సినిమా నుంచి ఫస్ట్‌సాంగ్ ప్రోమో వచ్చేసింది. తాజాగా శుక్రవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫస్ట్‌సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. 'మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా' అంటూ సాగే పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించారు. శనివారం ఉదయం 10గంటలకు ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూర్చారు.
ఇటీవలే విడుదలైనా పవన్ కళ్యాణ్ లుక్ పై అభిమానులు, పలువురు సినీ ప్రముఖలు స్పందించారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ కాకుండా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే నితిన్, నిఖిల్, ఫస్ట్ లుక్ పై స్పందిస్తున్నారు. వీరితో పాటు మంచు మనోజ్ కూడా పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




