ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన 'వకీల్ సాబ్'

ట్విట్టర్ లో  ట్రెండ్ క్రియేట్ చేసిన  వకీల్ సాబ్
x
Pawan kalyan
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్' .. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్' .. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ .. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చిత్రబృందం సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో రికార్డు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది...

PSPK26, VakeelSaabFirstLook అనే హాష్ టాగ్స్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండేళ్ళ విరామం తర్వాత పవన్ సినిమా చేస్తుండడంతో ఫ్యాన్స్ నుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా ఎదురుచూస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడంతో పవన్ స్టామినాకు రికార్డులు దసోహమన్నాయి. ఇక దాదాపుగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని మేలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories