రీమేక్ సినిమాపై వర్క్ చేయమని హరీష్ శంకర్ కి చెప్పిన పవన్ కళ్యాణ్

* ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో మొదలుపెట్టారు.

R Tripura Malini
Updated on: 4 Dec 2022 2:45 PM IST
Pawan Kalyan Told Harish Shankar To Work On The Remake Film
X

రీమేక్ సినిమాపై వర్క్ చేయమని హరీష్ శంకర్ కి చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు తన రాజకీయ పనులతో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమాల షూటింగ్లను కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిక్షనల్ సినిమా "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కరోనాకి ముందు సెట్స్ పైకి వెళ్ళింది కానీ ఇంకా విడుదల కి మాత్రం నోచుకోలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఏకంగా తొమ్మిది వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొనాబోతుండగా చిత్ర బృందం ఒక కీలక సన్నివేశం షూటింగ్ చిత్రీకరిస్తుంది.

భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది కాలంలో వేసవికాలంలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో "భవదీయుడు భగత్ సింగ్" సినిమాకి సైన్ చేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొన్నాళ్లు "భవదీయుడు భగత్ సింగ్" సినిమాని పక్కనపెట్టి "తేరి" రీమేక్ పై వర్క్ చేయమని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టే తమిళ్లో విజయ్ సూపర్ హిట్ సినిమా అయిన "తేరి" స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి తగ్గట్టుగా మరియు తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. డివివి దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story