పవన్ కళ్యాణ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా...

పవన్ కళ్యాణ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా...
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరియు స్టార్ బ్యూటీ సమంత కలిసి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే...
Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు స్టార్ బ్యూటీ సమంత కలిసి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "నిన్ను కోరి" ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ ను ఖరారు చేసారు. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు భూమిక హీరోహీరోయిన్లుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా "ఖుషి" అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
ఇప్పుడు అదే సినిమా టైటిల్ ని ఈ సినిమాకి పెట్టడం వల్ల మెగా మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా మోసం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. నోట్లో సిగరెట్టు తో స్టైలిష్ అవతారం లో విజయ్ దేవరకొండ కనిపిస్తూ ఉండగా పక్కనే సమంత చీరలో అందంగా కనిపిస్తోంది. వీరిద్దరి లుక్స్ విభిన్నంగా ఉండటంతో సినిమా కథ ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుందని ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ను ఉపయోగిస్తున్న విజయ్ దేవరకొండ, సమంత మరియు శివ నిర్వాణ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT