ఫ్యాన్స్ అదిరిపోయే న్యూస్ : సీఎంగా పవన్ ?

ఫ్యాన్స్ అదిరిపోయే న్యూస్ : సీఎంగా పవన్ ?
x
pawan kalyan
Highlights

రాజకీయాల వల్ల రెండేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే

రాజకీయాల వల్ల రెండేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ రీఎంట్రీ మూవీగా `వ‌కీల్‌సాబ్‌` తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయగా ఎక్కడలేని రెస్పాన్స్ వస్తోంది. త్వరలో టీజర్ కూడా రానుంది!

ఇక ఈ సినిమాతో పాటు పవన్ విభిన్నమైన కథ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నారు పవన్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ తెలంగాణ రాబిన్ హుడ్‌గా కనిపించానున్నడాని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ `వ‌కీల్‌సాబ్‌` , ఈ సినిమాని పార్లల్‌గా చేస్తున్నాడని సమాచారం.. ఇక ఈ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ ఇంతా పక్కగా ప్లాన్ చేసుకొని సినిమాలు చేసింది అయితే లేదు.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవ్వని కంప్లీట్ అయ్యాక పవన్ పూరితో సినిమాని చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కి పూరి లైన్ వినిపించాడని, పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను పూరి సీఎంగా చూపించబోతున్నాడట పూరి...ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories