అందుకే సాయి తేజ్ సినిమా ని లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan is Doing a Movie For Mega Hero
x

అందుకే సాయి తేజ్ సినిమా ని లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్

Highlights

Pawan Kalyan: అందుకే తేజ్ సినిమా ని లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఒకవైపు సినిమాలతో మాత్రమే కాకుండా మరోవైపు జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా తన రాజకీయ పనులతో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి దాకా సినిమాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తిగా రాజకీయ పనుల్లో నిమగ్నం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత తొందరగా తమిళంలో హిట్ అయిన "వినోదయ సీతం" సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ తో చేయాల్సిన "భవదీయుడు భగత్ సింగ్" సినిమాని సైతం పక్కన పెట్టేసి సముతిరఖని దర్శకత్వంలో ఈ రీమేక్ సినిమాని చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాని పక్కన పెట్టి మరీ ఈ సినిమాకి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఈ సినిమాలో రెండవ హీరోగా నటిస్తున్న తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ మళ్ళీ వెండితెరపై కనిపించింది లేదు. ఈ సినిమా సాయి తేజ్ కి బాగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు.

మరోవైపు ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ కేవలం 12 నుంచి 15 రోజులు డేట్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఇక మిగతా పార్ట్ షూటింగ్ మొత్తం సాయి ధరంతేజ్ పైన జరుగుతుంది. రెండు వారాల షూటింగ్ పవన్ కళ్యాణ్ కి పెద్ద విషయం ఏమీ కాదు చాలా తొందరగా పూర్తి చేసేయచ్చు. కానీ భవదీయుడు సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ కొన్ని నెలల పాటు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమాను ముందు పూర్తి చెద్దామని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories