Pawan Kalyan: రీమేక్ సినిమా కోసం రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan Is Charging Two Croes For Remake Movie
x

Pawan Kalyan: రీమేక్ సినిమా కోసం రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్

Highlights

Pawan Kalyan: ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రోజుకి ఎంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?

Pawan Kalyan: ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం రోజుకి రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" తెలుగు రీమేక్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్స్ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 24 రోజులు కాల్ షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎటువంటి బ్రేక్స్ లేకుండా తన పాత్ర షూటింగ్ మొత్తం పవన్ కళ్యాణ్ ఈ 24 రోజుల్లోనే పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. తన పాత్రతో ఎమోషనల్ కనెక్ట్ పోకుండా తన పాత్ర షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే 24 రోజులు కాబట్టి రోజుకి రెండు కోట్లు అంటే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 48 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రెమ్యూనరేషన్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన పాత్ర బాగా నచ్చి సినిమాని చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి మరింత అటాచ్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సముద్రఖని డైరెక్షన్ కూడా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిందట.

Show Full Article
Print Article
Next Story
More Stories