అందుకే "దేవర" బదులు "దేవుడు" అనే టైటిల్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Fixed The Title As Devara
x

 అందుకే "దేవర" బదులు "దేవుడు" అనే టైటిల్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

Highlights

* అందుకే "దేవర" బదులు "దేవుడు" అంటున్న త్రివిక్రమ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నెలకి ఒక సినిమా లాంచ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" మరియు సుజీత్ దర్శకత్వంలో ఒక గ్యాంగ్ స్టార్ సినిమా లతో బిజీగా ఉన్నారు. తాజాగా తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" సినిమా తెలుగు రీమేక్ ను అధికారికంగా లాంచ్ చేశారు పవన్ కళ్యాణ్.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ్లో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఒక పూజా కార్యక్రమంతో చిత్ర బృందం సినిమాని లాంచ్ చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమాకి "దేవుడు" అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం దేవుడు బదులు "దేవర" అనే టైటిల్ పెడితే బాగుంటుంది కదా అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే బండ్ల గణేష్ "దేవర" అనే టైటిల్ ను పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫిక్స్ చేశారు రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి అడిగితే తప్ప బండ్ల గణేష్ ఆ టైటిల్ను ఇంకెవరికి ఇవ్వరు. పవన్ కళ్యాణ్ కూడా అడిగే ప్రసక్తి లేదు దీంతో ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ "దేవుడు" అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories