ట్రైలర్ పై మండి పడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

Pawan Kalyan Fans Fires on the Bheemla Nayak Trailer | Telugu Movie News
x

ట్రైలర్ పై మండి పడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

Highlights

"భీమ్లా నాయక్" సినిమా పై మండి పడుతున్న నెటిజన్లు

Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా "భీమ్లా నాయక్". పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుం కోశియుం" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాలో కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే మాత్రమే హైలైట్ చేస్తున్నారని ఎప్పటి నుంచో కొందరు అభిమానులు వేలెత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి "అయ్యప్పనుం కోశియుం" సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి.

ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. కానీ "భీమ్లా నాయక్" చిత్ర ప్రమోషన్స్ విషయంలో మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. పైగా సినిమా టైటిల్ కూడా పవన్ కళ్యాణ్ పాత్ర పేరు పెట్టటం అభిమానులకు మాత్రం నచ్చలేదు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ లో మాత్రం రానా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు వాపోతున్నారు. మరి ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories