పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే అంతేనా? అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న..

Pawan Kalyan Directors are Having Trouble Getting Opportunities | Telugu Movie News
x

అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నా పవన్ కళ్యాణ్ డైరెక్టర్స్

Highlights

*అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నా పవన్ కళ్యాణ్ డైరెక్టర్స్

Pawan Kalyan Directors: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దాదాపు అందరు స్టార్ డైరెక్టర్లు అనుకుంటారు. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న దర్శకులకి ఆఫర్లు రావడం లేదు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత చాలా నెలల పాటు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన "వకీల్ సాబ్" సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించారు. తాజాగా పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు డైరెక్టర్లకి ఇండస్ట్రీలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. గతంలో వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ హీరోగా "ఐకాన్" సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అసలు ఇప్పుడు వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ కూడా లేదు.

మరోవైపు "భీమ్లా నాయక్" సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం దాదాపుగా వెనకాల నుంచి నడిపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి దక్కింది. దీంతో సాగర్ కే చంద్ర తో సినిమా చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ఒక వైపు క్రిష్ తో "హరి హర వీర మల్లు", మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో "భవదీయుడు భగత్ సింగ్" ఇతరత్రా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories