Pawan Kalyan Birthday: ప్రజలకు పవన్ లాంటి నాయకుడు కావాలి..పవన్‎కు చిరంజీవి శుభాకాంక్షలు

Pawan Kalyan Birthday Megastar Chiranjeevi wishes to Pawan Kalyan
x

Pawan Kalyan Birthday: ప్రజలకు పవన్ లాంటి నాయకుడు కావాలి..పవన్‎కు చిరంజీవి శుభాకాంక్షలు

Highlights

Pawan Kalyan Birthday:నేడు ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Pawan Kalyan Birthday: ప్రజలకు పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు కావాలంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇవాళ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఓ ప్రత్యేక ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి ఇలా రాస్తూ...

కల్యాణ్ బాబు..ప్రతీ ఏడాది నీకు పుట్టినరోజు వస్తుంది. కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకమైంది. ఆంధ్ర ప్రజానీకానికి కావాల్సిన సమయంలో మంచి నాయకుడు వచ్చాడు. వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు వాళ్ల ఇంటికి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత, నిలకడ కలిగిన ఓ నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో నీకు స్థానం ఇచ్చారు. అది సుస్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి. రావాలి. ఎన్నో అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేస్తావు..చేయగలవు. అదే నమ్మకం నాతోపాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ...అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories