పవన్ కళ్యాణ్ మార్కెట్ పడిపోవటానికి కారణాలు అవేనా?

Pawan Kalyan Bheemla Nayak Movie TRP Rating | Telugu Movie News
x

పవన్ కళ్యాణ్ మార్కెట్ పడిపోవటానికి కారణాలు అవేనా?

Highlights

*తక్కువ టిఆర్పి నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమా

Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే "భీమ్లా నాయక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా మంచి రివ్యూలను అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం యావరేజ్ గానే నిలిచింది. రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సముతిరఖని, మరియు సంయుక్త మీనన్ లు నటించారు.

ఈ సినిమా తాజాగా ఇప్పుడు టీవీలో ప్రసారమైంది. అయితే సినిమా టీవీ ప్రీమియర్ లో టి ఆర్ పి లు కూడా అంతంతమాత్రంగానే ఉండటం అభిమానులను కలవర పరుస్తోంది. "భీమ్లా నాయక్" సినిమా టెలివిజన్ ప్రీమియర్స్ తో కేవలం 10 టీఆర్పీ ని మాత్రమే నమోదు చేసుకుంది. పవన్ కళ్యాణ్ వంటి హీరో నటించిన సినిమా ఇంత తక్కువ టీఆర్పీ నమోదు చేసుకుంది ఇప్పటిదాకా లేదు.

అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఎంచుకుంటున్న స్క్రిప్టులు మరియు డైరెక్టర్లు వల్లనే పవన్ కళ్యాణ్ మార్కెట్ పడిపోతోంది అంటూ అభిమానులు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా మంచి కథలను ఎంచుకోవాలని థియేటర్లలో లాగానే టెలివిజన్లో కూడా అంతే మంది సినిమా చూసే విధంగా ఉండాలని అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఇకనైనా పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి ఆలోచిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories