Passion First Look: తెలుగులో మ‌రో కొత్త ప్రేమ క‌థ‌.. ప్యాష‌న్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

Passion First Look
x

Passion First Look: తెలుగులో మ‌రో కొత్త ప్రేమ క‌థ‌.. ప్యాష‌న్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

Highlights

Passion First Look: యంగ్ హీరో సుధీస్, అంకిత జంటగా నటిస్తున్న ‘ప్యాష‌న్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

Passion First Look: యంగ్ హీరో సుధీస్, అంకిత జంటగా నటిస్తున్న ‘ప్యాష‌న్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీని నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ కలిసి ‘రెడాంట్ క్రియేషన్స్’ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫస్ట్ లుక్ లాంచ్ చేసి సినిమా టీంకు తన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, "అరవింద్‌తో నాకు ఆనంద్ సినిమా నుంచే పరిచయం ఉంది. అప్పుడే అతనిలోని కథ చెబుతున్న నైపుణ్యాన్ని గుర్తించాను. అతను రాసిన ప్యాష‌న్ నవల చదివిన తర్వాత ఈ కథ ఎంత అథెంటిక్‌గా ఉందో అనిపించింది. ఫ్యాషన్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో నిండిన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. ఫస్ట్ లుక్ చూస్తేనే సినిమా పట్ల నమ్మకం పెరిగింది. మ్యూజిక్, కథ, ప్రొడక్షన్ మొత్తం బలంగా కనిపిస్తున్నాయి. టీంకు హృదయపూర్వక శుభాకాంక్షలు" అన్నారు.

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యాష‌న్ నవలా రూపంలో రావడమే ఒక పెద్ద అడుగు. దీనిని సినిమాగా తెరపైకి తెవ‌డానికి పెద్ద ప్రయత్నం జరిగింది. శేఖర్ కమ్ముల గారి ప్రోత్సాహం లేకపోతే ఇది సాధ్యపడేది కాదు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

దర్శకుడు అరవింద్ జాషువా మాట్లాడుతూ, "ఫ్యాషన్ కాలేజీలో ఒక మిడిల్ క్లాస్ విద్యార్థి అనుభవించే భావోద్వేగాలను పైన్ చేసిన కథే ప్యాష‌న్. నా నిజ జీవిత అనుభూతుల నుంచే ఈ కథ వచ్చింది. మా నిర్మాతలు, డిఓపీ సురేష్ నటరాజన్, మ్యూజిక్ డైరెక్టర్ హెర్నీ, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ లాంటి గొప్ప బృందం అండగా ఉంది. హీరో సుధీస్, హీరోయిన్ అంకిత ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారు. ఈ కథ యువతరానికి చాలా బలంగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా" అని వివరించారు.

న‌టీన‌టుల విష‌యానికొస్తే ఈ సినిమాలో సుధీస్, అంకిత, ప్రకాశ్ రాజ్, హిమజ, అశ్విన్ ముష్రన్, బెనర్జీ, చందన, అర్చన, ఉదయ్ మహేష్, సూర్య, కన్నడ కిషోర్, యుక్త, అర్జున్, శ్రేయషి, పరిణిత, అన్షుల, అర్జున్, అంకిత్ తదితరులు న‌టించారు. ప్యాష‌న్ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదలకానుంది. కొత్త భావోద్వేగాలతో, కొత్త ఫ్లేవర్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్ముతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories