మెడికల్ మాఫియా సినిమాలో స్టైలిష్ స్టార్

Parasuram Prepares the Medical Mafia Story for Bunny
x

మెడికల్ మాఫియా సినిమాలో స్టైలిష్ స్టార్ 

Highlights

Allu Arjun: బన్నీ కోసం మెడికల్ మాఫియా కథను సిద్ధం చేసిన పరశురామ్

Allu Arjun: "పుష్ప" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అయిన "పుష్ప: ది రూల్" తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ భారీ అంచనాల మధ్య పట్టాలెక్కింది. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ సినిమా చేయబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పరశురామ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి.

నిజానికి "గీతాగోవిందం" సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత గీత ఆర్ట్స్ పతాకంతో పరశురామ్ ఒక సినిమా సైన్ చేశారు. ఈ నేపథ్యంలోనే పరశురామ్ బన్నీకి ఒక మంచి కథ ఐడియా ను నేరెట్ చేసినట్లు తెలుస్తోంది. ఐడియా బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ డెవలప్ చేయమని బన్నీ చెప్పినట్లు సమాచారం. అయితే ఇది మెడికల్ మాఫియా కథ అని సమాచారం. ఇలాంటి విభిన్న జోనర్ లో అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య కోసం కూడా ఒక కథని సిద్ధం చేస్తున్న పరశురామ్ బన్నీ సినిమా స్క్రిప్ట్ తో కూడా బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories