బాలయ్యతో నో.. క్లారిటీ ఇచ్చిన ఆర్ఎక్స్ 100 భామ!

బాలయ్యతో నో.. క్లారిటీ ఇచ్చిన ఆర్ఎక్స్ 100 భామ!
x
Balakrishna, Paayl rajput(File Photo)
Highlights

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి మొదటి సినిమా మంచి సక్సెస్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి.

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి మొదటి సినిమా మంచి సక్సెస్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత సీనియర్ హీరోలు అయిన వెంకటేష్ తో వెంకీ మామ, రవితేజతో డిస్కో రాజా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. తాజాగా మరో సీనియర్ నటుడు బాలకృష్ణ సినిమాలో అవకాశం వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి..

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండడంతో ఒక హీరోయిన్ గా అంజలిని ఇప్పటికే ఎంపిక చేసింది చిత్రబృందం. ఇక తాజాగా మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో దీనిపైన పాయల్ రాజ్ పుత్ ట్విట్టర్లో స్పందిస్తూ..." అందరికీ నమస్కారం... నేను బాలకృష్ణ సార్ సినిమాలో నటించడం లేదు. చిత్ర బృందం ఇప్పటి వరకు నిన్ను సంప్రదించలేదు. ఈ సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తవం. దీనిని నా అభిమానులు గుర్తించగలరు" అంటూ పాయల్ పేర్కొంది.. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ '5 డబ్ల్యూ ఎస్' అనే సినిమాలో నటిస్తుంది ఇందులో పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ కనిపించనుంది.

బాలయ్య లుక్ వైరల్ :

సింహా, లెజెండ్ తరహాలోనే బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అందులో ఒకటి అఘోర పాత్ర అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన బాలయ్య కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఇందులో బాలయ్య చిన్నపాటి జుట్టుతో, గుబురు మీసంతో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇదే బోయపాటి సినిమాలో బాలయ్య లుక్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. త్వరలో ఈ సినిమా రెండో షెడ్యూల్ ని మొదలు పెట్టనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories