ఫస్ట్ ఏపీలోనే ఆక్సిజన్ ప్లాంట్.. తొలి ప్లాంట్ ఏ జిల్లాలో అంటే

Sonusood set Up Oxygen Plants Ap
x

సోనూసూద్ (TheHansindia)

Highlights

Sonu Sood: క‌రోనాపై చేస్తున్న పొరాటంలో న‌టుడు సోనూసూద్ నిరంతరంగా త‌న‌వంతు సేవలు అందిస్తూనే ఉన్నారు.

Sonu Sood: క‌రోనాపై చేస్తున్న పొరాటంలో న‌టుడు సోనూసూద్ నిరంతరంగా త‌న‌వంతు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఎక్కువ మందికి సహాయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ మరియు ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు శ్రీకారం చుట్టారు. అయితే మొదటి రెండు ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మరియు నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రణాళికను సిద్ధం చేశారు. సోనూసూద్ టీం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఉంది, తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్లాంట్స్ గురించి సోనూసూద్ మాట్లాడుతూ.. " ఈ ప్లాంట్స్ కోవిడ్ -19తో ధైర్యంగా పోరాడటానికి అవసరమైన వారికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇది చాలా అవసరం.. ఆంధ్రప్రదేశ్ తరువాత.. మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతం, మేము వివిధ రాష్ట్రాల నిరుపేద ఆసుపత్రులను గుర్తించాము.." అని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి ఐ.ఎ.ఎస్.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. "సోనూసూద్ మానవత్వ ఆలోచనలకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామ‌ని ఆయ‌న‌ అన్నారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా వారు ఇప్పటికే పొందారు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories