logo
సినిమా

Rajasekhar: రాజశేఖర్ కి ఓటీటీ నుండి వస్తున్న ఆఫర్లు

OTTs are Trying to Grab the Rajasekhars Sekhar Movie Rights
X

ఓటీటీ నుండి భారీ ఆఫర్స్ అందుకుంటున్న శేఖర్ సినిమా (ఫైల్ ఇమేజ్)

Highlights

Rajasekhar: భారీ ఆఫర్ లు అందుకుంటున్న రాజశేఖర్ సినిమా

Rajasekhar: కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ఫాం లకి బాగానే డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోల సినిమాలు కూడా డైరెక్టుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదలవుతున్నాయి. కానీ థియేటర్లు మళ్ళీ ఓపెన్ అవ్వడం తో పెద్ద సినిమాలన్నీ థియేటర్ల బాటలో వెళుతున్నాయి. పైగా ఈ మధ్యనే విడుదలైన "అఖండ" సినిమా హిట్ అవడంతో మీడియం రేంజ్ సినిమాలు కూడా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే మరోవైపు సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న "శేఖర్" అనే సినిమా రైట్స్ ను దక్కించుకోవాలని ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

మలయాళంలో సూపర్ హిట్ అయిన "జోసఫ్" అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ మధ్యలో జీవిత రాజశేఖర్ సినిమా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. కొన్ని సంస్థలు ఈ సినిమా కోసం పెద్ద అమౌంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్ట్ రిలీజ్ కోసం ఒక డిజిటల్ ప్లాట్ ఫాం వారు చిత్ర నిర్మాతలకు 25 కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సమయంలో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా లేక డిజిటల్ రిలీజ్ ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Web TitleOTTs are Trying to Grab the Rajasekhar's Sekhar Movie Rights
Next Story