logo
సినిమా

Vicky Katrina Wedding OTT Platform: 100 కోట్ల డీల్ ను కత్రినా ఒప్పుకుంటుందా?

Katrina Kaif, Vicky Kaushal reportedly Offered Rs 100 crore by OTT Platform for Exclusive Wedding Footage
X

కత్రినా కైఫ్ పెళ్లి వీడియో కోసం 100 కోట్లు ఆఫర్ చేసిన ఓటీటీ (ఫైల్-ఫోటో)

Highlights

కత్రినా కైఫ్ పెళ్లి వీడియో కోసం 100 కోట్లు ఆఫర్ చేసిన ఓటీటీ

Vicky Katrina Wedding OTT Platform: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 9న రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీలని పిలిచినట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక ఓటీటీ ప్లాట్ఫాం వారు ఈ బాలీవుడ్ కపుల్ కి పెద్ద ఆఫర్ ఇచ్చారట. తమ వెడ్డింగ్ ఫుటేజ్ ఇవ్వమని దాని కోసం 100 కోట్లు ఇవ్వడానికి రెడీ అయిందట ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్.

విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ లో పెళ్లి సవాయి మాదోపుర్ లోని సిక్స్త్ సెన్స్ ఫోర్ట్ లో జరగబోతోంది. మరి వీరిద్దరూ ఓటీటీ ప్లాట్ఫాం వారి ఆఫర్ ని ఒప్పుకొని వారి పెళ్ళి ని ఆన్లైన్లో విడుదల చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోలని ఆన్లైన్లో అమ్మారు. మరి విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ కూడా ఈ 100 కోట్ల డీల్ కి ఒప్పుకుంటారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

Web TitleOTT Platform Offers Katrina Kaif-Vicky Kaushal Rs 100 crore to Their Wedding Footage?
Next Story