OTT Movie: వ్యాన్‌లో ఊడిపడే శవం… డ్రైవర్ జీవితాన్ని మార్చేసిన క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: వ్యాన్‌లో ఊడిపడే శవం… డ్రైవర్ జీవితాన్ని మార్చేసిన క్రైమ్ థ్రిల్లర్
x

OTT Movie: వ్యాన్‌లో ఊడిపడే శవం… డ్రైవర్ జీవితాన్ని మార్చేసిన క్రైమ్ థ్రిల్లర్

Highlights

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక భాషల మధ్య ఉన్న గోడలు కూలిపోయాయి. ఏ భాషలో వచ్చినా డబ్బింగ్‌తో అన్ని రీజియన్లలో సినిమాలు, సిరీస్‌లు సులభంగా అందుబాటులో ఉన్నాయి.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ హంగామా

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక భాషల మధ్య ఉన్న గోడలు కూలిపోయాయి. ఏ భాషలో వచ్చినా డబ్బింగ్‌తో అన్ని రీజియన్లలో సినిమాలు, సిరీస్‌లు సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దయా’ (Daya) మంచి హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

స్ట్రీమింగ్ డిటైల్స్

2023లో విడుదలైన ఈ సిరీస్‌కు పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. SVF బ్యానర్‌లో శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని నిర్మించారు. 8 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నమ్బీసన్, జోష్ రవి, కమల్ కమరాజు, విష్ణుప్రియ భీమినేని, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ ఏంటి?

కాకినాడ ఫిషింగ్ కమ్యూనిటీలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే దయా (జేడీ చక్రవర్తి) తన గర్భవతిగా ఉన్న భార్య అలివేలుతో (ఈషా రెబ్బా) సంతోషంగా జీవించాలని కలలు కంటాడు. డబ్బు కోసం ఆగకుండా పని చేస్తూ, ఒకరోజు స్నేహితుడు ప్రభ (జోష్ రవి) ఒప్పించడంతో ఓ ప్రత్యేక కాన్సైన్మెంట్ రవాణా చేయడానికి అంగీకరిస్తాడు. కానీ డెస్టినేషన్ చేరేసరికి అతని వ్యాన్‌లో ప్రముఖ జర్నలిస్ట్ కవిత (రమ్య నమ్బీసన్) డెడ్ బాడీ ఉండటంతో షాక్ అవుతాడు. బుల్లెట్ గాయంతో చనిపోయిన ఆమె శవం తన వ్యాన్‌లో ఎలా వచ్చిందో అర్థంకాక, పోలీసులు దగ్గరికి వెళ్లకుండా ప్రభ సహాయంతో బాడీని వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు.

కానీ కవిత ప్రముఖ జర్నలిస్ట్ కావడంతో కేసు మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక దయా ఈ చిక్కులో ఎలా ఇరుక్కున్నాడు? అతను ఎలా బయటపడ్డాడు? అసలు ఆ బాడీ వెనక ఉన్న నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సిరీస్‌లోనే సమాధానం దొరుకుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories