OTT Movie: అబ్బాయిని ప్రేమించిన నక్క.. రాక్షస లోకంలో వీరి ప్రేమ గెలుస్తుందా?

OTT Movie Fox Girl Falls for Human Love Battle in Monster World Mind Bending Fantasy Thriller
x

OTT Movie: అబ్బాయిని ప్రేమించిన నక్క.. రాక్షస లోకంలో వీరి ప్రేమ గెలుస్తుందా?

Highlights

OTT Movie: ఫాంటసీ సినిమాలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు అందరికీ ఇష్టమే కదా! ఆ సినిమాలు చూస్తుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది.

OTT Movie: ఫాంటసీ సినిమాలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు అందరికీ ఇష్టమే కదా! ఆ సినిమాలు చూస్తుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. థియేటర్లలోనే కాదు, ఓటీటీల్లో కూడా ఇలాంటి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ ఫాంటసీ సినిమాలో ఒక అమ్మాయి ప్రేమ కోసం, రాక్షసులతో హీరో యుద్ధం చేస్తాడు. ఇందులో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి. కామెడీ, యాక్షన్ సీన్లతో ఈ సినిమా లాస్ట్ వరకు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ ఈ చైనీస్ ఫాంటసీ సినిమా పేరేంటో తెలుసుకుందాం.

ఈ చైనీస్ ఫాంటసీ కామెడీ సినిమా పేరు 'హాన్సన్ అండ్ ది బీస్ట్' . ఇందులో ఫెంగ్ షాఫెంగ్, లియు యిఫీ మెయిన్ రోల్స్‌లో చేశారు. 2017లో వచ్చిన ఈ సినిమాకి యాంగ్ క్షియవో డైరెక్టర్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ కోసం రాక్షసులతో ఫైట్ చేసే ఒక అబ్బాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

యువాన్ షువై అనే ఒక జంతువుల డాక్టర్ అప్పుల్లో మునిగిపోతాడు. ఆ డబ్బుల బాధ నుంచి బయటపడటానికి, డబ్బున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ని వెతుక్కుంటూ పెళ్లి చూపులకు వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా అతను బై జియాన్‌చు అనే ఒక నక్క రాక్షసిని కలుస్తాడు. చిన్నప్పుడు ఈ అబ్బాయి ఆమెను కాపాడతాడు. అందుకే ఆమె అతనికి థాంక్స్ చెప్పడానికి మనిషి రూపంలోకి వస్తుంది. ఆమె అందానికి వాడు ఫిదా అయిపోతాడు. ఇక అంతే, ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. కానీ రాక్షసుల లీడర్ యున్ జాంగ్‌హీ, మనుషులు, రాక్షసుల మధ్య ప్రేమ వ్యవహారాలు బాగోవని రూల్ పెడతాడు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి, అతను బై జియాన్‌చును తన లోకానికి తీసుకెళ్ళిపోతాడు. తన ప్రేమను మళ్ళీ పొందడానికి, యువాన్ షువై ధైర్యంగా రాక్షసుల లోకంలోకి ఎంట్రీ ఇస్తాడు.

రాక్షసుల లోకం అంతా ఈ యున్ జాంగ్‌హీ కంట్రోల్‌లో ఉంటుంది. వాడే ఆ లోకానికి పెద్దన్నయ్య. అక్కడ వాడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడతాడు. ముఖ్యంగా మనుషులు, రాక్షసులు కలిసి ఉండకూడదని ఆర్డర్ వేస్తాడు. వాళ్ల వల్ల గొడవలు రాకుండా, తమ లోకం సీక్రెట్‌గా ఉండాలని అలా చేస్తాడు. యువాన్ షువై రాక్షసుల లోకంలోకి వెళ్ళినప్పుడు, ఆ లోకం వాడికి మొత్తం కొత్తగా, చాలా డేంజర్‌గా అనిపిస్తుంది. లాస్ట్ కి యువాన్ షువై తన గర్ల్‌ఫ్రెండ్‌ని దక్కించుకుంటాడా? యున్ జాంగ్‌హీని ఓడిస్తాడా? తన అప్పుల బాధ తీరుతుందా? తెలుసుకోవాలంటే సినిమాని అస్సలు మిస్ కాకుండా చూడాల్సిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories