OTT Movie: పెళ్లి కూతురు గెటప్ లేసి యువతులను చంపే సైకో... ప్రతి సీను ట్విస్టులతో అదరగొట్టే మూవీ

OTT Movie Chaalchitro: A Crime Thriller with Twists and Turns, Featuring a Psycho Killer in Wedding Dresses
x

OTT Movie: పెళ్లి కూతురు గెటప్ లేసి యువతులను చంపే సైకో... ప్రతి సీను ట్విస్టులతో అదరగొట్టే మూవీ

Highlights

OTT Movie: ప్రస్తుతం ఓటీటీలు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. రకరకాల కథలతో పదుల సంఖ్యలో సినిమాలు వస్తున్నాయి.

Watch Chaalchitro OTT


OTT Movie: ప్రస్తుతం ఓటీటీలు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. రకరకాల కథలతో పదుల సంఖ్యలో సినిమాలు వస్తున్నాయి. వీటిలో క్రైం థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ప్రస్తుతం ఓ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో భారీ వ్యూస్ సాధిస్తుంది. ఈ మూవీ చివరి వరకు సస్పెన్స్ తో ప్రేక్షకులను కుర్చీకే పరిమితం చేస్తుంది. ఈ మూవీ పేరు ‘చాల్చిత్రో’. 2024 లో రిలీజ్ అయిన ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ ప్రతిమ్ డి. గుప్తా డైరెక్షన్లో వచ్చింది. ఈ సినిమా కోల్‌కతా నుండి వచ్చిన నలుగురు పోలీసుల చుట్టూ తిరుగుతుంది. వారు కోల్ కతాను వణికించిన వరుస హత్యల కేసును పరిశోధించడానికి వెళ్తారు. ఆ సైకో ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక కథలోకి వెళితే.. ఒంటరిగా ఉన్న యువతిని ఓ సైకో పెళ్లి కూతురిలా అలంకరించి చంపేస్తాడు. ఈ కేసు నగరంలో చర్చనీయాంశంగా మారుతుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ సైతం ఈ హత్యను చూసి షాక్ అవుతాడు. 12ఏళ్ల క్రితం ఇలాగే ఓ సైకో కొంతమంది అమ్మాయిలను చంపేస్తాడు. ఆ తర్వాత హీరో అతడిని అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా కోల్ కతాలో అలాంటి హత్యే జరిగింది. హీరో నజీర్, రితేష్ తో కలసి ఈ కేసును పరిశోధించడం మొదలుపెడతాడు. ఇదివరకే ఇలాంటి హత్యలు చేసిన వ్యక్తి జైల్లోనే ఉంటాడు. అతడు ఈ హత్య చేసే ఛాన్స్మ లేకపోవడంతో ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగానే మరో హత్య జరుగుతుంది. ఆ అమ్మాయిని కూడా చంపి పెళ్లికూతురులా రెడీ చేసి చంపేస్తాడు. వీళ్ళిద్దరికీ ఒక కామన్ పాయింట్..పెళ్లి పీటల వరకు వచ్చి ఈ యువతుల పెళ్లి ఆగిపోయి ఉంటుంది. అలా పెళ్ళిళ్లు ఆగిపోయిన కొంతమంది లిస్ట్ ను రెడీ చేస్తారు. పోలీసులు వాళ్ల మీద నిఘా పెడతారు. ఒక సైకో ఒక అమ్మాయిని చంపడానికి వస్తాడు. అక్కడ నజీర్ ఒక్కడే ఉండడంతో మిగిలిన వాళ్లకు ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో అతనొక్కడే లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి షాక్ అయ్యే విషయం కనిపిస్తుంది. ఆ సైకో అమ్మాయిని చంపేసే ఉంటాడు. అతడిని పట్టుకునే లోపే ఆ సైకో నజీర్ ను కూడా చంపేస్తాడు.

ఆ తర్వాత రితేష్ ఒక ప్లాన్ వేస్తాడు. రితేష్ తో గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయినట్లు పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు ఓ వీడియోను వైరల్ చేస్తాడు. అప్పుడు ఆ సైకో రితేష్ గర్ల్ ఫ్రెండ్ కోసం వస్తాడు. అప్పుడు పోలీసులు అతడిని పట్టేసుకుంటారు. అతడు ఎంక్వయిరీ చేసేటప్పుడు దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తాయి. నిజానికి ఆ సైకో ఓ ప్రొఫెసర్ కొడుకు. ఇన్స్పెక్టర్ పొరపాటున ఇతని తండ్రిని 12ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో అనవసరంగా అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత అతడు నిర్దోషి అని తెలిసి రిలీజ్ అవుతాడు. ఆ అవమానం భరించలేక తను సూసైడ్ చేసుకుంటాడు. ఆ సమయంలోనే ఈ సైకో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అప్పటినుంచి వీడు ఒక సైకోగా మారి ఇలా యువతులను చంపుతుంటాడు. ఇన్ స్పెక్టర్ భార్యను కూడా పూడ్చిపెట్టి కాపాడుకో అని సవాల్ విసురుతాడు.. మరి ఇన్ స్పెక్టర్ కాపాడుతాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories