Oppenheimer: మరోసారి సత్తా చాటిన ఓపెన్‌హైమర్‌

Oppenheimer Wins 7 Awards Including Best picture At The Bafta 2024 Ceremony
x

Oppenheimer: మరోసారి సత్తా చాటిన ఓపెన్‌హైమర్‌

Highlights

Oppenheimer: లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డుల (BAFTA) ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది.

Oppenheimer: లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డుల (BAFTA) ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ మూవీ ‘ఓపెన్‌హైమర్’ చిత్రం ఈ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడితో పాటు మొత్తం ఏడు విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. కాగా క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి BAFTA అవార్డు కావడం విశేషం. ఇక ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా వచ్చే నెల మార్చిలో జరగనున్న ఆస్కార్ రేసులో తన ప్లేస్‌ను మరింత సుస్థిరం చేసుకుంది. కాగా ‘పూర్ థింగ్స్‌’కు ఐదు, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’కు మూడు అవార్డులు దక్కాయి. ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’కు మూడు పురస్కారాలు దక్కాయి.

విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం - ఓపెన్‌హైమర్‌

ఉత్తమ దర్శకుడు - క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ నటుడు - సిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ నటి - ఎమ్మా స్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ సహాయ నటుడు - రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ సహాయ నటి - డావిన్‌ జాయ్‌ రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

ఉత్తమ స్కోర్‌ - లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ - హోట్‌ వాన్‌ హోటిమా (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్‌ ట్రైట్‌, ఆర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఫాల్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ - 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌

ఉత్తమ క్యాస్టింగ్‌ - ది హోల్డోవర్స్‌

ఉత్తమ ఎడిటింగ్‌ - జెన్నీఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ మేకప్‌ - నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - సైమన్‌ హ్యూస్

ఉత్తమ సౌండ్‌ - జానీ బర్న్‌, టార్న్‌ విల్లర్స్‌ (ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)



Show Full Article
Print Article
Next Story
More Stories