మరొకసారి "ఆర్ఆర్ఆర్" వేడుకలకి దూరంగా ఉన్న దానయ్య

Once again Danayya was away from the RRR celebration
x

మరొకసారి "ఆర్ఆర్ఆర్" వేడుకలకి దూరంగా ఉన్న దానయ్య

Highlights

D V V Danayya: మళ్లీ దానయ్యని పట్టించుకోని "ఆర్ఆర్ఆర్" బృందం

D V V Danayya: రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన "ఆర్ఆర్ఆర్" సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన "నాటు నాటు" పాటకి ఏకంగా ఆస్కార్ కూడా లభించింది. కానీ సినిమా ఆస్కార్ కి ప్రయత్నిస్తున్నప్పటినుంచి సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన డివివి దానయ్య పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు. మరోవైపు చిత్ర బృందం నుంచి ఒకరు కూడా అమెరికాకి వెళ్లే ముందు తనకి ఏమి చెప్పలేదని దానయ్య చెప్పటం తో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

అయితే ఆస్కార్ క్యాంపెయిన్ కోసం కావాల్సిన డబ్బులు దానయ్య ఇవ్వలేదని అందుకే ఆస్కార్ క్యాంపెయిన్ లో దానయ్య కనిపించలేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఆస్కార్ క్యాంపెయిన్ అంటే చాలా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది, చాలా చోట్లకి తిరగాల్సి ఉంటుంది. కానీ దానయ్య దీంట్లో అంత ఆసక్తి చూపించలేదు. అందుకే ఆస్కార్ సెలబ్రేషన్ లోకి కూడా దానయ్య దూరంగానే ఉన్నారు. కానీ ఈ మధ్యనే తెలుగు సినిమా ఇండస్ట్రీ "ఆర్ఆర్ఆర్" ఆస్కార్ విన్నర్ల కోసం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక వేడుకని ఏర్పాటు చేసింది.

చాలామంది ఇండస్ట్రీ సెలబ్రిటీలు దీనికి హాజరయ్యారు. కానీ చిత్ర నిర్మాత డివివి దానయ్య ఈ వేడుకలో కూడా కనిపించలేదు. దీంతో దానయ్యకి మరియు చిత్ర డైరెక్టర్ రాజమౌళికి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు దానయ్య సినిమా కలెక్షన్ల విషయంలో కూడా అంత ఆనందంగా లేరని కొన్ని కొన్ని ప్రాంతాల్లో సినిమా కలెక్షన్లు అనుకున్నంత అద్భుతంగా ఏమీ లేవని చెప్పటం ప్రేక్షకులకి మరింత షాక్ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories