తమన్నా తప్పుకోవడం మంచిదే అయింది : ఓంకార్

తమన్నా తప్పుకోవడం మంచిదే అయింది : ఓంకార్
x
Highlights

రాజుగారి గది మంచి హిట్టు కావడంతో అదే సినిమాకి వరుసగా సినిమాలు చేస్తున్నాడు యాంకర్, దర్శకుడు ఓంకార్.. ఈ నెల 18న రాజుగారి గది 3 ప్రేక్షకుల ముందుకు...

రాజుగారి గది మంచి హిట్టు కావడంతో అదే సినిమాకి వరుసగా సినిమాలు చేస్తున్నాడు యాంకర్, దర్శకుడు ఓంకార్.. ఈ నెల 18న రాజుగారి గది 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో ముందుగా హీరోయిన్ గా తమన్నాని అనుకున్నారు. పూజా కార్యక్రమంలో కూడా తమన్నా పాల్గొంది. కానీ అనుకోకుండా ఆ ప్లేస్ లోకి అవికా గౌర్ వచ్చింది. అసలు తమన్నా ఎందుకు తప్పుకుంది అన్నది చాలా మందికి ఓ డౌట్ గానే మిగిలిపోయింది. దీనిపైన ఓంకార్ క్లారిటీ ఇచ్చాడు.

దీనిపై 'రాజుగారి గది3' ప్రమోషన్లలో భాగంగా స్పందించాడు ఓంకార్. ముందు తమన్నాకి కేవలం లైన్ మాత్రమే చెప్పాము కానీ సినిమా మొదలుకావడానికి కొద్దిరోజుల ముందే ఫుల్ నేరేషన్ ఇచ్చాము. అయితే తమన్నా తన పాత్రను మార్చమని, దానికి తగ్గట్లు కథ మార్చాలని అడిగారు. అప్పుడు అంత సమయం లేకపోవడంతో అవికా గౌర్ తో సినిమాని స్టార్ట్ చేసామని చెప్పుకొచ్చాడు. తమన్నా ప్రాజెక్ట్ నుండీ తప్పుకోవడం వలన మంచే జరిగిందని అన్నాడు . అప్పుడు హీరోయిన్ పాత్రను తగ్గించి, హీరో పాత్రను పెంచామని ,కామెడి కూడా బాగా వచ్చిందని చెప్పుకొచ్చాడు. తమన్నా చెప్పిన చేంజెస్ తో 'రాజు గారి గది 4' గా తీసే ఛాన్స్ ఉందని అన్నాడు.

తమన్నా తప్పుకోవడంతో చాలా మంది హీరోయిన్స్ ని ట్రై చేసామని కానీ కుదరలేదని అన్నాడు. ఇక చివరగా అవికా గొర్ ని తీసుకున్నామని ,తానూ చాలా బాగా నటించిందని , సినిమా క్లైమాక్స్ మొత్తం అవికా చుట్టూనే తిరుగుతుంటుందని చెప్పుకొచ్చాడు ఓంకార్ ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories