మారుతీ - ప్రభాస్ సినిమా కోసం ఒక భారీ సెట్ ను సిద్ధం చేస్తున్న బృందం

Old Theater Set For Prabhas Worth Ten Crores
x

మారుతీ - ప్రభాస్ సినిమా కోసం ఒక భారీ సెట్ ను సిద్ధం చేస్తున్న బృందం

Highlights

* ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోంది.

Director Maruthi: ప్రభాస్ మరియు డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీగా విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ జోనర్ లో సినిమా చేయటం ప్రభాస్ కి ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా కథ మొత్తం ప్రభాస్ పాత్రకి తన తాతగారు నుంచి వచ్చిన ఒక పాత థియేటర్ చుట్టూ తిరగబోతుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రస్తుతం ఒక పాతబడిపోయిన థియేటర్ సెట్ ను సిద్ధం చేస్తోంది దీని కోసం నిర్మాతలు ఏకంగా 10 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్ దాదాపుగా ఈ సెట్లోనే జరుగుతుంది.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోంది. మాళవిక మోహన్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో "రాధే శ్యామ్" సినిమాలో ప్రభాస్ పక్కన కనిపించిన రిద్ధీ కుమార్ కూడా మూడవ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభట్ల ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా హిందీలో కూడా విడుదలకు సిద్ధమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories