OG Updates: శ్రియా రెడ్డి తుపాకీ ఎవరిపై ఎక్కుపెట్టింది? హైప్ పెంచుతున్న శ్రియా రెడ్డి 'ఓజీ' లుక్!

OG Updates: శ్రియా రెడ్డి తుపాకీ ఎవరిపై ఎక్కుపెట్టింది? హైప్ పెంచుతున్న శ్రియా రెడ్డి  ఓజీ లుక్!
x
Highlights

OG Updates: అభిమానుల ఉత్సుకతను మరింత పెంచుతూ, మేకర్స్ తాజాగా శ్రియా రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. 'ఓజీ'లో ఆమె 'గీత' అనే పాత్రలో నటిస్తున్నారు.

OG Updates: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ'. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్యామ్, మరియు శ్రియా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శ్రియా రెడ్డి పాత్రపై ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొంది.

అభిమానుల ఉత్సుకతను మరింత పెంచుతూ, మేకర్స్ తాజాగా శ్రియా రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. 'ఓజీ'లో ఆమె 'గీత' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో శ్రియా రెడ్డి చీరకట్టులో కోపంగా తుపాకీ ఎక్కుపెట్టి కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, ఆమె ఆ తుపాకీ ఎవరిపై ఎక్కుపెట్టిందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని మేకర్స్ తెలిపారు.

'ఓజీ' లో ఇతర పాత్రలు

'ఓజీ' చిత్రంతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే అర్జున్ దాస్ పాత్ర పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. బాక్సింగ్ ప్రిపరేషన్‌లో ఉన్న అర్జున్ దాస్ ఇంటెన్స్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్యామ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.




Show Full Article
Print Article
Next Story
More Stories