బాలీవుడ్ నటికి ఆర్ధిక కష్టాలు...

బాలీవుడ్ నటికి ఆర్ధిక కష్టాలు...
x
Highlights

సినిమా వాళ్ళ ప్రపంచం రంగులతో కూడుకున్నది. బయటకు హుందాగానే కనిపించన వారి జీవితం వెనుక చాలా కష్టాలే ఉంటాయి. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి కూడా అలాంటి...

సినిమా వాళ్ళ ప్రపంచం రంగులతో కూడుకున్నది. బయటకు హుందాగానే కనిపించన వారి జీవితం వెనుక చాలా కష్టాలే ఉంటాయి. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి కూడా అలాంటి కష్టాల్లోనే ఉంది. ఒకప్పుడు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన సినీ నటి నూపుర్ అలంకార్.. ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు ఈమెకి అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్కోరోజు గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది.

గత నెల సెప్టెంబరు 24న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో- ఆపరేటివ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక నోటీసు పంపించింది. ఇందులో పీఎంసీ బ్యాంకు ఆరు నెలల వరకూ నూతనంగా ఎటువంటి లావాదేవీలు చేయకూడదని సూచించింది. దీంతో ఆ బ్యాంకులో వున్న ఖాతాదారులు రూ. 25 వేలకు మించిన మొత్తాన్ని తీసుకోలేకపోతున్నారు. అందులోనే నూపుర్‌కు బ్యాంకు ఖాతా ఉంది. దీనితో ఆమెకి ఈ పరిస్థితి ఏర్పడింది.

దీనిపై నూపుర్ మాట్లాడుతూ... నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నన్ను నమ్ముకొని నా కుటుంబ కూడా ఉంది. మేము రోజువారీ ఖర్చుల కోసం ఇంట్లోని బంగారు, వెండి నగలను అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఇప్పుడు తెలిసిన వారి దగ్గర దాదాపుగా యాబై వేల రూపాయల అప్పు చేసాము. ఇప్పుడు అది తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయింది నూపుర్ ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories