Jr NTR: చిరు దారిలో ఎన్టీఆర్‌..

NTR Will Act In The Same Role As Chiranjeevi
x

చిరంజీవి లాంటి పాత్రలోనే నటించనున్న ఎన్టీఆర్

Highlights

* కొరటాల కోసం జాలరి పాత్రలో ఎన్టీఆర్

JR NTR: ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 13వ తేదీన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒక జాలరి కొన్ని పరిస్థితుల కారణంగా స్మగ్లర్ గా మరియు గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ.

అయితే మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా జాలరి బ్యాక్ డ్రాప్ తోనే ఉంటుందట. ఎన్టీఆర్ ఈ సినిమాలో జాలరి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటిదాకా కొరటాల శివ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే. అందులో హీరో పాత్రలకు బోలెడు షేడ్స్ కూడా ఉంటాయి. ఇక అన్ని సినిమాల లోనూ ఒక సామాజిక మెసేజ్ కూడా ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ సినిమా కోసం కొరటాల సముద్ర జలాలు, కలుషిత నీరు వంటి కొన్ని సామాజిక ఇబ్బందులను తీసుకొని వాటి గురించి సినిమాలో చూపించబోతున్నారట. ఎన్టీఆర్ ఈ సినిమాలో విభిన్న గెటప్లలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి మరియు లెజెండరీ నటి శ్రీదేవి కూతురు అయిన జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories