logo
సినిమా

ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న ఎన్టీఆర్

NTR Wants to do a Film With that Bollywood Director
X

ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న ఎన్టీఆర్

Highlights

*ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న ఎన్టీఆర్

NTR: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇక "అర్ఆర్ఆర్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఇప్పుడు ఎన్టీఆర్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీ లో కూడా ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారు.

వారు అందరూ ఎన్టీఆర్ డైరెక్ట్ హిందీ సినిమా ఎప్పుడు చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా ఎన్టీఆర్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు.బాలీవుడ్లో ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉంది అని అడగగా ఎన్టీఆర్ వెంటనే రాజ్ కుమార్ హిరానీ అని చెప్పారు.

రాజ్ కుమార్ హిరానీ తన సినిమాలలో ఉండే రియలిస్టిక్ ఎమోషన్స్ ని చాలా సరదాగా చూపిస్తారని ఆ విధానం తనకు చాలా నచ్చుతుందని అన్నారు ఎన్టీఆర్. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించే భారీ బడ్జెట్ సినిమాలు కూడా తనకు చాలా ఇష్టమని అన్నారు. ఇక "అర్ఆర్ఆర్" సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కు బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు వస్తాయని చెప్పుకోవాలి. మరి ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెడతారా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Web TitleNTR Wants to do a Film With that Bollywood Director
Next Story