Devara Movie Records: రిలీజ్‌కు ముందే 'దేవర' రికార్డుల వర్షం. . ఆ లిస్టులో ప్రభాస్ సరసన చేరిన ఎన్టీఆర్

Devara Movie Records: ఓవర్‌సీస్‌లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా దేవర (Devara) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 25 Sept 2024 1:38 AM IST
Devara Movie Records
X

Devara Movie Records

Devara Movie Records: ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర మూవీ (Devara Movie) గురించి చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆకాశన్నంటే అంచనాలు ఉన్నాయి. ఆచార్య ఫ్లాప్‌ తర్వాత ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఓవర్‌సీస్‌లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా దేవర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో బిగ్గెస్ట్ రికార్డ్స్‌ బుకింగ్స్, బెనిఫిట్ షోలతో రికార్డును సృష్టించిన దేవర చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్‌ ఆ ఘనత సాధించిన రెండో హీరోగా నిలిచారు.

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలుగా 2 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ని నార్త్‌ అమెరికా మార్కెట్‌లో సాధించిన రెండో హీరోగా తారక్‌ నిలిచారు. తారక్‌ నటించిన ట్రిపులార్‌, ఇప్పుడు దేవర ఈ ఘనతను సాధించింది. ఇదిలా ఉంటే ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా ప్రభాస్‌ నిలిచారు. సలార్‌, కల్కి 2898 ఏడీ చిత్రాలతో ప్రభాస్‌ ముందు వరుసలో ఉన్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతోన్న దేవర మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story