
NTR-Neel Movie: షాకింగ్.. ఎన్టీఆర్–నీల్ మూవీకి ‘బ్రూస్లీ’ టైటిల్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తున్నప్పటికీ.. అదే ఫైనల్ టైటిల్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అభిమానులు కూడా ఇదే టైటిల్ ఖరారవుతుందని భావిస్తూ.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ సహా టీజర్ విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని సమాచారం.
అయితే తాజాగా ఎన్టీఆర్-నీల్ సినిమాకు సంబంధించిన టైటిల్ మారిపోయిందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్‌కు ‘బ్రూస్లీ’ అనే పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్ 2015 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'బ్రూస్లీ: ది ఫైటర్' చిత్రానికి ఉపయోగించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. అప్పట్లో బ్రూస్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. శ్రీను వైట్ల మార్క్ కామెడీ లేకపోవడంతో సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు. ఇప్పుడు అదే టైటిల్ ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌కు వినిపించడం ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ భారీగా వెయిట్ లాస్ అయి.. లీన్ లుక్‌లో కనిపిస్తున్నాడనే వార్తలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ జోర్డాన్‌లో జరుగుతుంతోంది. ఇందులో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టివినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. మొత్తానికి టైటిల్‌పై వస్తున్న వార్తలు నిజమా కాదా అన్నది తెలియాలంటే.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు మాత్రం ఈ టైటిల్ గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా కొనసాగడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ నీల్ తనదైన మాస్ స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్ కేజీఎఫ్, సలార్ కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




