ప్రశాంత్ నీల్ సినిమా కోసం ముహూర్తం ఫిక్స్ చేసిన ఎన్టీఆర్

NTR fixed the moment for Prashant Neel movie
x

ప్రశాంత్ నీల్ సినిమా కోసం ముహూర్తం ఫిక్స్ చేసిన ఎన్టీఆర్ 

Highlights

* ప్రశాంత్ నిల్ సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందంటే..

Jr NTR: "ఆచార్య" సినిమాతో తన కెరియర్ లోనే మొట్టమొదటి డిసాస్టర్ ను అందుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తాజాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని త్వరలోనే మొదలుపెట్టాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 20 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని కూడా పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "కే జి ఎఫ్" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతుందని సమాచారం.

సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం అదిరిపోయే షూటింగ్ సెట్లను కూడా నిర్మించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories