NTR: "నటుడిగా ఏదైనా చేయడానికి సిద్ధం!"

NTR: నటుడిగా ఏదైనా చేయడానికి సిద్ధం!
x

NTR: "నటుడిగా ఏదైనా చేయడానికి సిద్ధం!"

Highlights

స్టార్ హీరో ఎన్టీఆర్ తన నటనకు ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా, నటుడిగా ఏదైనా చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్ 2’ ఈ నెల ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

స్టార్ హీరో ఎన్టీఆర్ తన నటనకు ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా, నటుడిగా ఏదైనా చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్ 2’ ఈ నెల ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ తాజా సంచిక కవర్‌పై ఎన్టీఆర్ ఫోటోను ప్రచురించింది. దుబాయ్‌లో నిర్వహించిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ సందర్భంగా ఎస్క్వైర్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు:

"నా జీవితంలో ఏదీ ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. 'కుంగ్ ఫూ పాండా' సినిమాలోని ఒక కోటేషన్ నాకు ఎంతో ఇష్టం – 'నిన్నటి రోజు చరిత్ర, రేపటి రోజు రహస్యమే, ఈ రోజు మనకు దేవుడిచ్చిన బహుమతి.' నేను ఎప్పుడూ వర్తమానంపై దృష్టి పెడతాను.

నటుడిగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా కుటుంబ సినీ వారసత్వం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేను. కానీ, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే కథలు చెబుతూ వారితో మమేకమవాలనుంది.

ముఖ్యంగా, నిజాయతీతో భావోద్వేగాలను వ్యక్తం చేసే నటుడిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను."

‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కియారా అద్వాణీ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories