మళ్లీ మొదలైన ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్

NTR and Ram Charan fan war has started again
x

మళ్లీ మొదలైన ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్

Highlights

* కార్తికేయ పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్

RRR Movie: మెగా ఫాన్స్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు మెగా హీరోలు మరియు నందమూరి హీరోలు తమ మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అభిమానులలో మాత్రం మార్పు రాలేదు. ఇక "ఆర్ఆర్ఆర్" సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ సినిమా లో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ని బాగా చూపించారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ పడుతుంటే రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ ని బాగా చూపించారని మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేశారు.

తాజాగా ఇప్పుడు ఆస్కార్ డిస్కషన్ల విషయంలో కూడా మళ్లీ ఇప్పుడు అదే జరుగుతోంది. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ని కూడా ఆస్కార్ కి కన్సిడర్ చేయాలి అని వచ్చిన ఒక వార్త రాజమౌళి తనయుడు కార్తికేయ వల్లనే వచ్చిందని మెగా ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కార్తికేయ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని అందుకే ఎన్టీఆర్ కోసం ఇలాంటి ఒక పెయిడ్ క్యాంపెయిన్ ని నడిపించాడని వారి ఆరోపణ. సినిమాతో రామ్ చరణ్ కి వచ్చిన ప్రశంసలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కి క్రెడిట్ దక్కాలని కార్తికేయ ఇలాంటి పెయిడ్ ప్రచారం మొదలు పెట్టాడని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇరు వర్గాల అభిమానులు తమ అభిమాన హీరో వల్లే సినిమా హిట్ అయిందని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏమైనా ఫ్యాన్స్ కార్తికేయను బ్లేమ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మొదలు పెట్టేసారు. ఒకవైపు చిత్ర బృందం మాత్రం సినిమా భారీ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మరోవైపు ఈ ఇరువర్గాల ఫ్యాన్స్ ఎప్పుడూ తమ వార్ కి ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories