NTR 31: మొదలైన ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ.. తొలి రోజే 3 వేల మందితో..

NTR and Prashanth Neels Action Film Begins with 3,000 Junior Artists in Hyderabad
x

NTR 31: మొదలైన ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ.. తొలి రోజే 3 వేల మందితో..

Highlights

NTR 31: కేజీఎఫ్‌, సలార్‌ మూవీస్‌తో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

NTR 31: కేజీఎఫ్‌, సలార్‌ మూవీస్‌తో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం సలార్‌ 2తో బిజీగా ఉన్న ప్రశాంత్‌ నీల్‌ ఇదే సమయంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల వరకు మొదలు కాలేదు. అయితే తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టేశాడు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాను గురువారం ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ను ప్రశాంత్‌ ఎన్టీఆర్‌ లేకుండానే మొదలు పెట్టారు. ప్రస్తుతం వార్‌2 సినిమాలో ఎన్టీఆర్‌ బిజీగా ఉండడంతో హీరో లేకుండా ఉండే సన్నివేశాలను ప్రశాంత్ మొదలు పెట్టాడు. సినిమా షూటింగ్‌లో మొదటి రోజే 3,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా ఉత్సాహంతో సినిమా షూట్ ను ప్రారంభించారు. ఇది ఒక గొప్ప యాక్షన్ సినిమా అవుతుందన్నారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోను చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వార్‌2 చిత్రంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ మొదటి షెడ్యూల్‌ కోసం కేవలం 10 రోజులు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. రెండవ దశలో ఎక్కువసేపు షూట్ ఉంటుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. మరి ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories