War 2: వార్2లో స్పెషల్ సాంగ్.. 500 మందితో హృతిక్, ఎన్టీఆర్ స్టెప్పులు

Ntr and Hrithik Song With 500 Dancers
x

వార్2లో స్పెషల్ సాంగ్.. 500 మందితో హృతిక్, ఎన్టీఆర్ స్టెప్పులు

Highlights

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరిలో అత్యుత్తమ డ్యాన్సర్ ఎవరు అంటే చెప్పడం కష్టమే. బాలీవుడ్‌లో హృతిక్, టాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఇద్దరూ టాప్ క్లాస్ డ్యాన్సర్లుగా పేరున్న హీరోలు.

War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మూవీ వార్2. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరిలో అత్యుత్తమ డ్యాన్సర్ ఎవరు అంటే చెప్పడం కష్టమే. బాలీవుడ్‌లో హృతిక్, టాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఇద్దరూ టాప్ క్లాస్ డ్యాన్సర్లుగా పేరున్న హీరోలు. డ్యాన్స్ విషయంలో వీరిద్దరూ ఎవరికి వారే సాటి అనిపించుకుంటారు. హృతిక్ స్టైలిష్ మూవ్‌మెంట్స్, ఎన్టీఆర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు ఇప్పటికే అభిమానులను కట్టిపడేస్తుంటాయి. అలాంటి వారిఇద్దరూ కలిసి ఓ పాటకు స్టెప్పులేస్తే.. ఇక చూడడానికి రెండు కళ్లు సరిపోవు. ఇప్పుడు ఆ అపురూప ఘటనను వార్‌2తో ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ.

ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ కోసం ఓ స్పెషల్ సాంగ్ తెరకెక్కిస్తున్నట్టు గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడా పాట చిత్రీకరణ మొదలైనట్టు తెలుస్తోంది. సినిమాలో కీలక క్లైమాక్స్ సన్నివేశానికి ముందు వచ్చే పాట కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ అదిరిపోనుందని ట్రేడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ పాట కోసం దాదాపు 500 మంది డ్యాన్సర్ల పాల్గొననున్నట్టు సమాచారం. దీనికోసం ముంబాయిలో భారీ సెట్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫీగా వ్యవహరిస్తున్నారు. సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ప్రీతమ్ ఈ పాటను చాలా గొప్పగా స్వరపరిచారని టాక్. ఈ పాటకు మేకర్స్ రూ.20 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు ఆరు రోజుల పాటు దీని చిత్రీకరణ కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

వార్2కు హైలెట్ సాంగ్ ఇదే అవుతుందని టాక్. దీంతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల డ్యాన్స్ ఫైర్ చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్.. కబీర్, ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో ఇద్దరూ విభిన్న మిషన్లలో ఉంటారని సమాచారం. వీరిద్దరి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్, మాస్ డ్యాన్స్ మూమెంట్స్ సినిమాకి హైలెట్ కానున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ మాస్ డ్యాన్స్ వార్2లో గోల్డెన్ మూమెంట్ అవుతుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ భారీ సాంగ్ షూటింగ్, మేకింగ్ లెవెల్ చూస్తే.. ఇది ఇండియన్ సినిమాకు మరో క్రేజీ మ్యూజికల్ మూమెంట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ కలిస్తే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక వార్2 2025లో థియేటర్లలో సందడి చేయబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories