వెలవెల బోయిన బాక్స్ ఆఫీస్ : నవంబర్ నెలలో ఒక్క హిట్టు కూడా లేదు

వెలవెల బోయిన బాక్స్ ఆఫీస్ : నవంబర్ నెలలో ఒక్క హిట్టు కూడా లేదు
x
Highlights

నవంబర్ నెలలో సరైనా హిట్టు లేకా వెలవెలబోయింది బాక్స్ ఆఫీస్ ... చెప్పుకోడానికి బాగానే సినిమాలు విడుదల అయినప్పటికీ గట్టిగా చెప్పేందుకు భారీ హిట్టు మాత్రం ఒక్కటి కూడా లేదు.

నవంబర్ నెలలో సరైనా హిట్టు లేకా వెలవెలబోయింది బాక్స్ ఆఫీస్ ... చెప్పుకోడానికి బాగానే సినిమాలు విడుదల అయినప్పటికీ గట్టిగా చెప్పేందుకు భారీ హిట్టు మాత్రం ఒక్కటి కూడా లేదు.. రవిబాబు ఆవిరి, విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా లాంటి సినిమాలతో నవంబర్ నెల మొదలైంది. టిజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి.. ఇక మీకు మాత్రమే చెప్తా అనే సినిమా లఘుచిత్రం లాగే ఉందని విమర్శలు వచ్చాయి.. దానితో పాటు వచ్చిన దండుపాళ్యం-4 కూడా ఫ్లాప్ అయింది.

ఇక నవంబర్ ఎనమిదిన తిప్పరామీసంతో పాటు ఏడు చేపల కథ, కోనాపురంలో, శివలింగాపురం, గాలిపురం జంక్షన్, 4 ఇడియట్స్ లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో శ్రీవిష్ణు హీరోగా నటించిన తిప్పరామీసం సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ సినిమా అనుకున్నంతగా ఆడలేకపోయింది. ఇక ఏడు చేపల కథ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక మిగతా సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.

ఇక నవంబర్ 15 న సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ, విశాల్ యాక్షన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో తెనాలి మొదటి భాగం వరకు ఒకే అనిపించినా రెండవ భాగం పూర్తిగా తేలిపోవడంతో సినిమా ప్లాప్ అయింది. ఇక విశాల్ యాక్షన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక నవంబర్ 22 న రాజేంద్రప్రసాద్ తోలుబొమ్మలాట, ఈషా రెబ్బా రాగల 24 గంటల్లో లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వీటితో పాటు విడుదలైన జాక్ పాట్, బీచ్ రోడ్ చేతన్ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.

ఇక నవంబర్ 29 న అర్జున్ సురవరం, రాజావారు రాణిగారు సినిమాలు రిలీజయ్యాయి. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ అనే స్పందన వస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మొత్తం ఈ నవంబర్ నెలలో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సినిమా ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇక అన్ని సినిమాల కేల్ల్లా సందీప్ మాధవ్ హీరోగా నటించిన జార్జిరెడ్డి సినిమాకి మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories