అద్భుతాన్ని ఆవిష్కరించిన నాసికా చిత్రకారుడు.. ముక్కుతో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలు...

Nose Painting Artist Rambabu Drew SS Rajamouli Jr NTR Ram Charan Pics With His Nose | Live News
x

అద్భుతాన్ని ఆవిష్కరించిన నాసికా చిత్రకారుడు.. ముక్కుతో రాజమౌలి, ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలు...

Highlights

RRR - Nose Painting: RRR సినిమా రికార్డు విజయాన్ని సొంతం చేసుకోవాలని రాంబాబు ఆకాంక్ష...

RRR - Nose Painting: తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి చరిత్రాకారుడని నాసికా చిత్రకళాకారుడు సత్యవోలు రాంబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన సద్గురు దిస్కూల్ ఆఫ్ ఆర్ట్ వ్యవస్థాపకులు, నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు తన కళాప్రతిభతో అభిమానాన్ని చాటుకున్నారు. సినిమాను తెరకెక్కించిన దర్శకుడు... హీరోల రూపాలను అద్భుతమైన కళతో ఆవిష్కరించాడు ఓ కళాకారుడు.

సినిమా వాళ్లపట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమా డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రాం చరణ్ చిత్రాలను నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు ముక్కుతో గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సినీ దర‌్శకులు రాజమౌలి సినిమాపట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ... సినిమా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories