సర్కారు వారి పాట సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాల గురించి క్లారిటీ ఇచ్చిన పరశురామ్...

No Vulgar scenes in Sarkaru Vaari Paata Said Director Parasuram | Mahesh Babu | Keerthy Suresh
x

సర్కారు వారి పాట సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాల గురించి క్లారిటీ ఇచ్చిన పరశురామ్...

Highlights

Sarkaru Vaari Paata: మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకు వెళ్తున్న ఈ సినిమాలో...

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన "సర్కారు వారి పాట" సినిమా భారీ అంచనాల మధ్య మే 12న థియేటర్లలో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకు వెళ్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమాలో ఒక సెకండ్ హాఫ్ లో కీర్తి సురేష్ మహేష్ బాబు మధ్య సన్నివేశాలు వల్గర్ గా ఉన్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అమెరికా లో కళావతి పై కాలు వేసి పడుకోవడం అలవాటు అయిపొయింది అని, ఇక్కడకి వచ్చాక నిద్ర పట్టడం లేదని చెప్పిన మహేష్ పాత్ర ప్రతిరోజూ రాత్రి కళావతి ని ఇంటికి రమ్మని చెప్తూ ఉంటాడు. ఈ సన్నివేశాలు బాలేవని, చాలా వల్గర్ గ ఉన్నాయని కొందరి ఆరోపణ.

కానీ చిత్ర డైరెక్టర్ పరశురామ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆ సన్నివేశాలలో వల్గారిటీ లేదని, ఉంటే మహేష్ బాబు అసలు చేసేవారే కాదని చెప్పిన పరశురామ్ పిల్లలు ఎప్పుడు తల్లి పక్కనే పడుకోవాలని అనుకుంటారని, అలాగే వీరి మధ్య బంధం కూడా స్వఛ్చమైనది అని క్లారిటీ ఇచ్చారు పరశురామ్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సముద్రఖని, నదియా, సౌమ్య మీనన్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories