ఒక్క ప్యాన్ ఇండియన్ సినిమా కూడా లేని అక్కినేని హీరోలు.. కారణం..?

No Pan India Movies for Akkineni Heroes Nagarjuna Naga Chaitanya Akhil | Tollywood News
x

ఒక్క ప్యాన్ ఇండియన్ సినిమా కూడా లేని అక్కినేని హీరోలు.. కారణం..?

Highlights

Akkineni Heros: ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా సినిమాల హవా బాగానే నడుస్తుంది...

Akkineni Heros: ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా సినిమాల హవా బాగానే నడుస్తుంది. మీడియం బడ్జెట్ హీరోలు కూడా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇక పెద్ద స్టార్లు అయితే ప్రతి సినిమాని ప్యాన్ ఇండియా సినిమా(Pan India Movie) గానే తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో విడుదలైన "పుష్ప", "ఆర్ఆర్ఆర్", "కే జి ఎఫ్" సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచాయి.

కానీ ఇప్పటి వరకు అక్కినేని కుటుంబం(Akkineni Family) నుంచి ఒక్క హీరో కూడా ప్యాన్ ఇండియన్ సినిమా చేయకపోవడం తో అభిమానులు నిరాశ చెందుతున్నారు. నాగార్జున కానీ నాగ చైతన్య లేదా అఖిల్ కానీ ఇప్పటిదాకా ఒక ప్యాన్ ఇండియన్ సినిమాలో కూడా నటించింది లేదు. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న హిందీ సినిమా "బ్రహ్మాస్త్ర"లో నాగార్జున(Akkineni Nagarjuna) ముఖ్య పాత్ర పోషించారు. అలాగే అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" ఈ సినిమాలో కూడా నాగ చైతన్య(Naga Chaitanya) ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ రెండు ప్యాన్ ఇండియన్ సినిమాలే అయినప్పటికీ అందులో వీరు హీరోలు కాదు. మరోవైపు రవితేజ(Ravi Teja), రానా(Rana Daggubati) వంటి హీరోలు కూడా వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెడుతుంటే అక్కినేని హీరోలు మాత్రం ప్యాన్ ఇండియన్ సినిమాలపై మొగ్గు చూపించకపోవడం తో అభిమానులు కూడా దీని గురించి సోషల్ మీడియా(Social Media) లో చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories