Prabhas: రాజమౌళి కాదు కదా..అతనిలా ఇండియాలోనే ఎవరూ సినిమాలు తీయలేరు

Prabhas
x

Prabhas: రాజమౌళి కాదు కదా..అతనిలా ఇండియాలోనే ఎవరూ సినిమాలు తీయలేరు

Highlights

Prabhas: టాలీవుడ్‌లో హీరోల మేనరిజం మార్చాలన్నా, వారిలోని అసలైన మాస్ యాంగిల్‌ను బయటకు తీయాలన్నా అందరికీ గుర్తొచ్చే పేరు డైలాగ్ కింగ్ పూరీ జగన్నాథ్. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్, పూరీ జగన్నాథ్ రైటింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

Prabhas: టాలీవుడ్‌లో హీరోల మేనరిజం మార్చాలన్నా, వారిలోని అసలైన మాస్ యాంగిల్‌ను బయటకు తీయాలన్నా అందరికీ గుర్తొచ్చే పేరు డైలాగ్ కింగ్ పూరీ జగన్నాథ్. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్, పూరీ జగన్నాథ్ రైటింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. పూరీ రాసే డైలాగులు, క్యారెక్టర్ డిజైనింగ్ ఈ ప్రపంచంలోనే ఎవరూ చేయలేరని ప్రభాస్ కొనియాడారు.

ఇటీవల 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సంతోష్ శోభన్, మానస వారణాసితో ముచ్చటించిన ప్రభాస్, తన కెరీర్‌లో పూరీ జగన్నాథ్‌తో చేసిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా 'బుజ్జిగాడు', 'ఏక్ నిరంజన్' సినిమాల గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

పూరీ గారు నాకు బుజ్జిగాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు నిజంగా పిచ్చెక్కిపోయింది. అంతవరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఆ క్యారెక్టరైజేషన్ నాపై ఎంత ప్రభావం చూపిందంటే, బయట ఎవరితో మాట్లాడుతున్నా తెలియకుండానే బుజ్జిగాడిలా డైలాగులు చెప్పేవాడిని అని ప్రభాస్ నవ్వుతూ చెప్పారు.

పూరీ జగన్నాథ్‌లా క్యారెక్టర్లను డిజైన్ చేసేవారు కేవలం ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరూ లేరని ప్రభాస్ అనడం విశేషం. ఆయన స్టైల్‌ను ఎవరూ ఇమిటేట్ చేయలేరని, అంత సహజంగా ఆయన కలం నుంచి డైలాగులు జాలువారుతాయని ప్రశంసించారు.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 'ఏక్ నిరంజన్' చిత్రంలో సోనూ సూద్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అందులోని కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు నచ్చడంతో, హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'దబాంగ్' లో వాటిని వాడుకున్నారట. సోనూ సూద్ స్వయంగా పూరీకి ఫోన్ చేసి అడగగా, ఆయన ఎంతో కూల్‌గా పర్మిషన్ ఇచ్చేశారని ప్రభాస్ గుర్తుచేసుకున్నారు.

ముఖ్యంగా ఏక్ నిరంజన్‌లో బాధ వస్తే మగవాడైనా ఏడుస్తాడు అనే సీన్ తనకెంతో ఇష్టమని ప్రభాస్ చెప్పారు. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు పూరీ జగన్నాథ్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఒక దర్శకుడి ప్రతిభను ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇంతలా గౌరవించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories