హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్

Nitin Has Completed 20 Years as a Hero | Tollywood News
x

హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్ 

Highlights

హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్

Nithiin: "జయం" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు నితిన్. తేజ దర్శకత్వంలో సదా హీరోయిన్ గా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నితిన్ నెమ్మదిగా మంచి హీరోగా ఎదిగారు. కెరీర్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నప్పటికీ ఇష్క్ వంటి సినిమాలతో మళ్లీ కం బ్యాక్ ఇస్తూనే వచ్చారు. తాజాగా "మేస్ట్రో" వంటి సినిమాలతో విభిన్న జోనర్ లో కూడా సినిమాలు చేయటం మొదలు పెట్టారు నితిన్.

తాజాగా ఇప్పుడు "మాచర్ల నియోజకవర్గం" అనే సినిమాతో త్వరలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే జయం సినిమా విడుదల ఇవాల్టికి 20 ఏళ్లు గడిచింది. అంటే నితిన్ తెలుగు తెరకి హీరోగా పరిచయం అయ్యి 20 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు నితిన్. "డియర్ ఫ్రెండ్స్.. ఇరవై ఏళ్ళ క్రితం నా మొదటి సినిమా జయం తో నా జర్నీ మొదలుపెట్టాను. నేను నా అనుభూతి గురించి మాటల్లో చెప్పలేను. కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నాకు మొదటి సినిమాతోనే బ్రేక్ ఇచ్చిన తేజ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నను.

నా సినిమాల కోసం పనిచేసిన డైరెక్టర్లు, టెక్నీషియన్లు, నటీనటులు, నిర్మాతలు, క్రూ మెంబెర్స్, స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు. మీలో ఒక్కరు లేకపోయినా ఇవాళ నేను ఇక్కడ ఉండే వాడిని కాదు. కష్టాల్లో కూడా అండగా నిలుస్తూ ఎప్పుడూ నాపై నమ్మకం పెట్టుకుంటూ నన్ను ముందుకు నడిపించిన వారందరికీ నేను కృతజ్ఞుడిని. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అభిమానులకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు నితిన్.

Show Full Article
Print Article
Next Story
More Stories