Nithya Menen: భీమ్లా నాయక్ సినిమాలో ఆఫర్ అలానే వచ్చింది అంటున్న నిత్య

Nithya Menen: "భీమ్లా నాయక్" సినిమాలో తన పాత్ర గురించి చెబుతున్న నిత్య మీనన్

admin1
Published on: 8 Dec 2021 2:12 PM IST
Nithya Menen Talks about Her Role in Bheemla Nayak Movie
X

"భీమ్లా నాయక్" సినిమాలో తన పాత్ర గురించి చెబుతున్న నిత్య మీనన్ (ఫోటో-ది హన్స్ ఇండియా)

Nithya Menen: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్టయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమా "భీమ్లా నాయక్" అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిత్యమీనన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిత్యమీనన్ ఈ సినిమాలో తనకి ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.

"నేను ఆఫర్ల కోసం ఎవరిని అడగను. నాకు ఏ పాత్రలు సూట్ అవుతాయని అనిపిస్తే నేను ఆ పాత్రలను మాత్రమే ఒప్పుకుంటాను. అది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి పాత్రలతోనే దర్శకనిర్మాతలు నా దగ్గరికి వస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా "భీమ్లా నాయక్" సినిమా లో పాత్ర నేను చేస్తే బాగుంటుందని అనుకుని నన్ను సంప్రదించారు" అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్.

అంతేకాక త్రివిక్రమ్ తనను ఒక రౌడీలా చూస్తారని అందుకే "సన్నాఫ్ సత్యమూర్తి" సినిమాలో కూడా అలాంటి పాత్ర ఇచ్చారు అని చెప్పింది నిత్య.

admin1

admin1

Next Story