భీష్మ ట్రైలర్ : బలవంతుడితో పోరాడి గెలవచ్చు... అదృష్టవంతుడితో గెలవలేం

భీష్మ ట్రైలర్ : బలవంతుడితో పోరాడి గెలవచ్చు... అదృష్టవంతుడితో గెలవలేం
x
Highlights

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీష్మ’.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలను కలగజేశాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండు నిమిషాల అయిదు సెకండ్స్ ఉన్న చిత్ర ట్రైలర్ అందరిని ఆకట్టుకునేలా ఉంది.

'దుర్యోధనుడు.. దుశ్శాసన.. ధర్మరాజు.. యమధర్మరాజు.. శని.. శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దాని వల్లేనేమో ఒక్కరూ కూడా పడటం లేదు' అంటూ నితిన్‌ డైలాగ్‌లతో చిత్ర ట్రైలర్ మొదలవుతుంది. రష్మికతో రొమాన్స్, వెన్నెల కిషోర్ కామెడీ పంచ్‌ డైలాగ్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఇక విలన్‌గా బెంగాల్ నటుడు జిషు సేన్‌గుప్తా ఆకట్టుకున్నాడు. ఇక చిత్ర ట్రైలర్ లో చివర్లో "బలవంతుడితో పోరాడి గెలవచ్చు. అదృష్టవంతుడితో గెలవలేం" అంటూ విలన్ చెప్పే డైలాగ్ చిత్ర ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. వ్యవసాయం నేపథ్యంలో రెండు కంపెనీలకు మధ్య కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు హైదరాబాదులో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories