Nithiin: సాయి పల్లవికి జోడీగా నితిన్?

Nithiin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి "మ్యాస్ట్రో".

Venkata Chari
Published on: 4 April 2021 7:54 PM IST
Nithiin to romance Sai Pallavi?
X

నితిన్, సాయి పల్లవి (ఫొటో హన్స్ ఇండియా)

Nithiin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి "మ్యాస్ట్రో". అలాగే మరో ప్రాజెక్ట్ పవర్‌పేట. ఇది రెండు భాగాలుగా విడుదల అవుతుంది. నితిన్ ఇతర దర్శకులతోనూ చర్చలు జరుపుతున్నాడు. తాజా సమాచారం మేరకు డైరెక్టర్ వక్కంతం వంశీ తో సినిమా చేసేందకు చర్చలు నడుస్తున్నాయి.

కాగా, ఈ సినిమాలో నితిన్, సాయి పల్లవితో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' సినిమా విఫలమైన తరువాత, ఈ రచయిత కమ్ డైరెక్టర్ కొత్త స్క్రిప్ట్ రాసేందుకు చాలా సమయం తీసుకున్నారు. అల్లు అర్జున్‌తోనే వంశీ మళ్లీ సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. కానీ, హీరో నితిన్ తో ఈ డైరెక్టర్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Venkata Chari

Venkata Chari

Next Story