Rang De: వీకెండ్ కలెక్షన్స్..'జాతిరత్నాలు' తర్వాతి స్థానంలో 'రంగ్ దే'

Nithiin Rang De Movie Weekend Collections
x

Rang De (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

Rang De Collections: నితిన్, కీర్తి సురేష్ హీరోహీయిన్లగా నటించిన చిత్రం 'రంగ్ దే'. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.

Rang De Collections: నితిన్, కీర్తి సురేష్ హీరోహీయిన్లగా నటించిన చిత్రం 'రంగ్ దే'. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం( మార్చి 26)న విడుదలైంది. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు

సినిమా విడుదలకు ముందు నుంచే పాజిటివ్ బజ్ తెచ్చుకునన్న రంగ్ దే. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. 'రంగ్ దే' సినిమా 10.35 కోట్ల షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సోమవారం హోళీ సెలవు కావడంతో ఈరోజు కూడా బాగానే వసూలు చేసే అవకాశం ఉంది.

ఇక ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా డీసెంట్ వసూళ్ళు రాబడుతోంది. 1.5 కోట్లకు అమ్ముడైన ఈ సినిమా ఇప్పటికే 270K డాలర్లు రాబట్టి 1.90 కోట్లతో బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాక 2021లో 'జాతిరత్నాలు' తర్వాత ఎక్కువ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా 'రంగ్ దే' నిలిచింది. రంగ్ దే బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాను టోటల్ గా 23.9 కోట్లకు అమ్మగా.. 24.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాని సమాచారం.జీ నెట్వర్క్ (జీ తెలుగు అండ్ జీ 5) 10కోట్ల రూపాయలు పెట్టి సినిమాను కోనుగోలు చేసినట్లు ప్రచారం సాగతుంది.

నైజాం - 3.79 కోట్లు..

సీడెడ్ - 1.66 కోట్లు..

వైజాగ్ - 1.30 కోట్లు..

గుంటూరు - 1.09 కోట్లు..

ఈస్ట్ - 0.85 కోట్లు..

వెస్ట్ - 0.57 కోట్లు..

కృష్ణ - 0.65 కోట్లు..

నెల్లూరు - 0.44 కోట్లు

మొత్తం 10.35 కోట్ల

Show Full Article
Print Article
Next Story
More Stories