ఆసక్తి రేపుతున్న నితిన్ 'చెక్‌' ఫస్ట్‌ గ్లింప్స్‌

ఆసక్తి రేపుతున్న నితిన్ చెక్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌
x
Highlights

నితిన్‌ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చెక్’.

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'చెక్'. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. చెక్ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది. జైలు గదిలో నితిన్‌ను చూపిస్తూ ''జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు''అంటూ మొదట వచ్చే వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తి రేపుతున్నాయి. మరోపక్క న్యాయమూర్తి ఆదిత్యకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం, పోలీస్‌ అధికారి ''దేశద్రోహి..అదీ నీ గుర్తింపు'' అని పిలవడం సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉన్నాయి.

ఈ మూవీలో నితిన్‌లోని కొత్తకోణాన్ని తెరపై చూపించేలా చంద్రశేఖర్‌ యేలేటి సినిమాను తీర్చిదిద్దుతున్నారని అర్థమవుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ వి ఆనంద్ కుమార్ ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ బాణీలు అందిస్తున్నారు. గత ఏడాది భీష్మ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు నితిన్. ఆ సినిమా బాక్సాఫీసు ముందు భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories