Bheeshma : యూఎస్‌లోదుమ్ముదులుపుతోన్న 'భీష్మ' .. భారీ వసూళ్లు


యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఉద్దేశ్యంలో ఆచితూచి అడుగేశాడు. 'ఛలో' సినిమాతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుని విమర్శల ప్రసంశలు దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా విడుదలై విజయం సాధించింది.
కాగా... ఈ సినిమా అమెరికాలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. 'భీష్మ' సినిమా శనివారం యూఎస్‌లో 523,900 వసూలు చేసింది. అంటే, భారత కరెన్సీ ప్రకారం సుమారు 3.76 కోట్లు రూపాయలు అన్న మాట. దీనిలో ప్రీమియర్ల షోల ద్వారా వచ్చింది 94,800 డాలర్లు దాదాపు రూ.68 లక్షలు రూపాయలు. ఇక ఈ సినిమాకు శుక్రవారం వసూలైన మొత్తం 151,700 డాలర్లు సుమారు 1.09 కోట్లు రూపాయలు. శనివారం వసూలైంది 277,400 డాలర్లు దాదాపు 1.99 కోట్లు రూపాయలు. మొత్తంగా రూ.3.76 కోట్ల గ్రాస్‌ను యూఎస్‌లో వచ్చింది. ఇక ఆదివారం కూడా కలెక్షన్లు భారీగానే ఉంటాయి. ఓవర్‌సీస్‌లో 'భీష్మ' థియేట్రికల్ రైట్స్‌ను .2.4 కోట్ల రూపాయలకు అమ్మినట్లు సమాచారం. ఏపీ తెలంగాణల్లో అయితే ఆదివారం హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకోపోతుంది.
#BlockbusterBheeshma $500K & Counting in USA!! 😍🤩@actor_nithiin @iamRashmika @VenkyKudumula @mahathi_sagar @Blueskycinemas @saisriram_dop @sahisuresh @vamsi84 @SVR4446 @adityamusic pic.twitter.com/UwzyU5anFe
— Sithara Entertainments (@SitharaEnts) February 23, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



