Nithiin: పరా 'జయం' ఎదురైనా... 'ధైర్యం' గా నిలబడిన 'అల్లరి బుల్లోడు'

Nithiin 30 Movie Title Maestro Announced on his 38th Birthday
x
నితిన్ బర్త్ డే సందర్భంగా తాజా చిత్రం మాస్ట్రో పోస్టర్ విడుదల
Highlights

Nithiin Birthday: నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు.

Nithiin Birthday: నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఈ రోజు తన 38వ పుట్టిన రోజు సందర్భంగా 30 వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. జయంతో మొదలైన సినిమా కెరీర్… గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతీ చిత్రంలో తన నటనకు పదును పెట్టుకుంటూ సాగుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే నితిన్ కెరీర్ లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువ ఉన్నాయి. అయినా 'ధైర్యం' కోల్పోకుండా 'దిల్' తో నిలబడ్డాడు. ఈ ఏడాది మొదట్లో 'చెక్' తో పరాజయం పలకరించిన..'రంగ్ దే' తో 'సంబంరం' చేసుకుంటున్నాడు ఈ లవర్ బాయ్. మార్చి 30 న నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ 'అల్లరి బుల్లోడి' గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం…

జయం సినిమా పోస్టర్

అతి చిన్న వయసులోనే తేజ లాంటి డైనమిక్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జయం' సూపర్ డూపర్ హిట్ తో సంచలనం క్రియోట్ చేసింది. టాలీవుడ్ లోకి ఘనంగా అడుగు పడేలా చేసింది. ఇక ఆ తరువాత వినాయక్, రాజమౌళి లాంటి దర్శకులతో సినిమాలు చేసి మరింత పాపులర్ అయ్యాడు నితిన్. కానీ, ఆతరువాత పరాజయాల పరంపర కొనసాగింది. స్టార్ హీరో గా ఎదిగిన క్షణంలోనే… జీరో స్థాయికి చేరుకున్నాడు. ఏ సినిమా కూడా విజయాన్ని అందివ్వలేదు. తండ్రి సుధాకర్ రెడ్డి(నైజాం డిస్ట్రిబ్యూటర్) సపోర్ట్ తో నిలదొక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

నితిన్ మరియు పవన్ కళ్యాణ్

పరాజయాలకు కారణాలు అన్వేషించి, కథల ఎంపికలో శ్రద్ధ చూపాడు. వరుస ఫ్లాపులతో దూరమైన హోదాను 'ఇష్క్' తో పొందాడు. ఇక వెనకడుగు వేయలేదు. పవన్‌ కల్యాణ్‌ తొలి ప్రేమ సినిమా చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు నితిన్. తొలిప్రేమను ఏకంగా 28సార్లు చూశాడంట. పవన్ పేరును పదేపదే స్మరిస్తూ ఉంటాడు. పవర్ స్టార్ కు వీరాభిమాని.

 • నితిన్‌ పూర్తి పేరు నితిన్ కుమార్‌ రెడ్డి. 1983 మార్చి 30న నిజామాబాద్ లో జన్నించాడు. తల్లిదండ్రులు సుధాకర్‌రెడ్డి, విద్యారెడ్డి.
 • నితిన్ మొదటి సినిమా 'జయం'. 2002 లో విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు.
 • తొలి సినిమా 'జయం' తో ఫిలింఫేర్ అవార్డు దక్కింది
 • రెండో సినిమా డైరెక్టర్ వినాయక్ 'దిల్' తో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు ఈ లవర్ బాయ్.
 • రాజమౌళి తో చేసిన 'సై' సినిమాతో టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో స్టార్ డమ్ పెరిగింది.
 • ఆ తరువాత వరుసగా 14 ఫ్లాపులు నితిన్ కెరీర్ ను దెబ్బతీశాయి.
 • 2012లో 'ఇష్క్‌' సినిమాతో మళ్లీ నితిన్ విజయంతో ఎంట్రీ ఇచ్చాడు.
 • గతేడాది వెంకి కుడుముల రూపొందించిన 'భీష్మ'తో మరో భారీ హిట్‌ ని సాధించాడు.
 • ఈ ఏడాది 'చెక్‌' తో పరాజయం అందుకున్నా.. తాజాగా 'రంగ్‌దే' మూవీతో సక్సెస్ అందుకున్నాడు
 • గతేడాది జులై 16, 2020న షాలిని కందుకూరితో నితిన్‌ వివాహం జరిగింది.
 • నితిన్‌ ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్‌ 'మాస్ట్రో'లో నటిస్తున్నాడు.
Show Full Article
Print Article
Next Story
More Stories